- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కేసీఆర్ విషకౌగిలిలో జీవన్ రెడ్డి’ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నేతలు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. జీవన్ రెడ్డి తన ఆత్మను చంపుకుని కేసీఆర్ ను కౌగిలించుకున్నారని, జీవన్ రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నారని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నేతలు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. జీవన్ రెడ్డి తన ఆత్మను చంపుకుని కేసీఆర్ ను కౌగిలించుకున్నారని, జీవన్ రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నారని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా నాలుగు దశాబ్దాల నుంచి అండగా నిలబడిన పార్టీని వదిలిపెట్టి కేసీఆర్ విష కౌగిలిలోకి జీవన్ రెడ్డి వెళ్లారని, కేసీఆర్ విష కౌగిలిలో చిక్కుకుని బలై పోయిన సీనియర్ల నాయకులను జీవన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు. కేసీఆర్ రాక్షస, అవినీతి పాలన పైన పదేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశానని చెప్పుకుంటున్న జీవన్ రెడ్డిని దేవుడు ఎలా కలిసి పనిచేయమని పంపిస్తాడు? అవినీతి పరులు, నియంతలతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెపుతాడా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పోవాలని, కేసీఆర్ రావాలని ఈ రాష్ట్రంలో ఏ సామాన్యుడైనా అన్నాడా? కేసీఆర్ అనే చీడ పురుగును తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారు.. పదేళ్ల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడి ప్రజా పాలన తెచ్చుకున్నారన్నారు.
ప్రతి ఎన్నికలో కేసీఆర్‌కు ఇచ్చిన గుండు సున్నాలు, కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డికి వచ్చిన మార్కులు జీవన్ రెడ్డికి తెలియవా? ఈ రాష్ట్రానికి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వద్దే వద్దని ఆయన బిడ్డ కవితనే చెపుతోంది.. ఆమెనే సొంత పార్టీ పెట్టుకుంటోంది.. ఆ పార్టీతో పనిలేదని ప్రతి తెలంగాణ బిడ్డ కూడా స్పష్టం చేస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలెవ్వరూ కోరుకోవడం లేదు.. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేశాడని జీవన్ రెడ్డినే అనేక సార్లు అన్నారు.. పార్టీ ఫిరాయింపుల పితామహుడు కేసీఆర్ తో జీవన్ రెడ్డి చేతులు ఎలా కలిపాడు? అని ఆది శ్రీనివాస్ నిలదీశారు. గత పదేళ్లలో జరిపిన ఫిరాయింపులపైన కేసీఆర్‌తో బహిరంగ క్షమాపణ చెప్పిస్తాడా..? జీవన్ రెడ్డి ముందు ప్రజలకు సమాధానం చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ పైన మాట్లాడాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు.






