చిప్ప కూడు తినే టైమ్ దగ్గర పడింది.. కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

by Ramesh Naini |

కేటీఆర్ చిప్ప కూడు తినే టైమ్, కటకటాలు లెక్క పెట్టే సమయం దగ్గర పడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

చిప్ప కూడు తినే టైమ్ దగ్గర పడింది.. కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ మీకు చిప్ప కూడు తినే టైమ్, కటకటాలు లెక్క పెట్టే సమయం దగ్గర పడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మీ పాపాలు అన్నీ తవ్వుతున్నారు.. పదేళ్ల మీ అధికారంలో ఎంతో మంది పై అక్రమ కేసులు పెట్టారని, చిన్న డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డిని జైల్‌కు పంపి వికృతంగా ప్రవర్తించింది నువ్వేనని ఆయన ఆరోపణలు గుప్పించారు. బాల్క సుమన్ పైన పోలీసులు అక్రమ కేసు పెట్టలేదని, మంత్రి వివేక్ కాన్వాయ్ పైన సుమన్ దాడి చేశాడు.. ఆయన చర్యలను అందరూ చూశారు.. మంత్రుల మీద దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మీరు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రవర్తించారు.. దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నావని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్ని సార్లు చీ కొట్టిన మీ బుద్ధి మారడం లేదని ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.

Next Story