Aadi Srinivas: కేటీఆర్ సవాల్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దిమ్మ తిరిగే కౌంటర్!

by Ramesh Naini |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

Aadi Srinivas: కేటీఆర్ సవాల్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దిమ్మ తిరిగే కౌంటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడయాకు ఒక వీడియో విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి మ‌తి త‌ప్పి కేటీఆర్ పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మా రేవంత్ రెడ్డి చాచి కొడితే ఫామ్ హౌస్ లో ప‌డింది ఎవ‌రో అంద‌రికీ తెలుసని అన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి దమ్ము ఏంటో తెలియలేదా? అని నిలదీశారు.

స‌ర్పంచ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి 48 గంట‌లే అయింది.. ఈడ్చి కొడితే మీకు 25 శాతం సీట్లు రాలేదని విమర్శించారు. పిల్ల‌ కాకికి ఏం తెలుసు ఉండేల్ దెబ్బ‌ అన్నట్లు.. వెళ్లి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న మీ అయ్య‌ను అడుగు రేవంత్ రెడ్డి ద‌మ్ము ఏమిటో అని ఫైర్ అయ్యారు. నాలుగు రోజులు ఆగు జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి నీ పార్టీని చిత్తు చిత్తు చేసి మా కాంగ్రెస్ కార్యకర్తల ద‌మ్ము నిరూపిస్తామని సవాల్ చేశారు.

కేటీఆర్.. ఈర్ష ద్వేషంతో మాట్లాడుతున్న త‌ప్ప మ‌రొక‌టి కాదని అభిప్రాయం తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, క‌డియం శ్రీహ‌రి లాంటి సీనియ‌ర్ నాయ‌కుడిపైన అవాక్కులు, చెవాక్కులు పేలుతున్నారని అన్నారు. తండ్రి వ‌య‌సు ఉన్న వారిని కించ‌ప‌ర్చేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీక‌ర్ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేకున్నా నోటికి వచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారన్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా గెలుపు కాంగ్రెస్ పార్టీదే.. ప్ర‌తిప‌క్షానికి కూడా మీరు ప‌నికి రాకుండా పోతారని ఆది శ్రీనివాస్ జోస్యం చెప్పారు.

Next Story