- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నేతలు ఎందుకు తుమ్మడిహట్టి కోసం పోరాడటం లేదు: ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్
తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ కట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, తుమ్మిడిహట్టితో తక్కువ ఖర్చుతో ఆదిలాబాద్, కరీంనగర్ మెదక్, రంగారెడ్డి , చేవేళ్ల వరకు అతి తక్కువ ఖర్చుతో గ్రావిటి ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ కట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, తుమ్మిడిహట్టితో తక్కువ ఖర్చుతో ఆదిలాబాద్, కరీంనగర్ మెదక్, రంగారెడ్డి , చేవేళ్ల వరకు అతి తక్కువ ఖర్చుతో గ్రావిటి ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ తెలిపారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే 100 టీఎంసీ నీళ్లను వాడుకోవచ్చని, 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించవచ్చని ఆయన తెలిపారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే ముంపు చాలా తక్కువగా ఉంటుందని, ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు తుమ్మిడిహట్టి అనుమతులపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? ఆయన ప్రధాని సభలో ప్రస్తావించి ఉంటే సమస్యకు పరిష్కారం లభించేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు తుమ్మడి హట్టి పైన ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి ఎందుకు బీజేపీ నాయకులు అనుమతులు ఇప్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీ వాళ్లు పోలవరం కోసం కోట్లాడి 7 మండలాలను సాధించుకుంటే తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు తుమ్మడిహట్టి కోసం పోరాడటం లేదు? ఆది శ్రీనివాస్ నిలదీశారు. కేంద్రంలో, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని, అందుకు బీజేపీ నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసిందని, కానీ, ఇప్పటి వరకు స్పందన లేదని ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు ఒత్తిడితో అప్పటి బీజేపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ లోని 7 మండలాలను ఎపీలో విలీనం చేశారని, తుమ్మడిహట్టి దగ్గర 1000 ఎకరాల లోపే మహారాష్ట్ర భూములు ముంపునకు గురవుతున్నాయని, బీఆర్ఎస్ నాయకులు కొందరు బీజేపీలోని తమ శ్రేయోభిలాషులతో కలిసి తుమ్మడిహట్టి పైన కుట్ర చేస్తున్నారనే అనుమానం ఉందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తుమ్మడి హట్టి పైన తెలంగాణ ప్రభుత్వం రూ.10000 కోట్లు ఖర్చు చేసిందని, కెనాల్స్ కూడా చాలా వరకు తవ్వకాలు జరిగాయన్నారు. కాళేశ్వరం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కేసీఆర్ ఆనాలోచిత నిర్ణయాల వల్ల నష్టం జరిగిందని, కాళేశ్వరాన్ని ఏటీఎంలా బీఆర్ఎస్ నాయకులు మార్చుకున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. మేడిగడ్డను కూడా పునరుద్దిరిస్తున్నామని, తుమ్మిడి హట్టి బ్యారేజీ ప్రాంతాన్ని ఇప్పటికే మా మంత్రులు వివేక్, జూపల్లి పరిశీలించి వచ్చారని ఆయన తెలిపారు. తుమ్మిడిహట్టి నిర్మిస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుందని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయని, ఆ రెండు పార్టీలు ఒక్కటై మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే అనుమానాలున్నాయని ఆది శ్రీనివాస్ ఆరోపణలు గుప్పించారు.






