TG: గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి(Kanche Gachibowli) రెవెన్యూ స‌ర్వే నం.25లో గల 400 ఎక‌రాల భూమి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

TG: గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి(Kanche Gachibowli) రెవెన్యూ స‌ర్వే నం.25లో గల 400 ఎక‌రాల భూమి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భూమిపై ప్రస్తుతం రాద్ధాంతం నడుస్తోన్న విషయం తెలిసిందే. మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), శ్రీధర్ బాబు(Sridhar Babu), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)తో కమిటీ ఏర్పాటైంది. వీరు హెచ్‌సీయూ అథారిటీ, విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరుపనున్నారు.

మరోవైపు.. కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ(Congress Government) తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వంద ఎకరాల్లో చెట్లు నరికి వేయడం అనేది చిన్న విషయం కాదని.. చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. తమ ప్రశ్నలకు సీఎస్‌ సమాధానం చెప్పడంతో పాటు అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

Next Story