తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేత

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్(Aadhaar Link) చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25వ తేదీ లోపు తప్పనిసరిగా ఆధార్ అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. కాగా, ‘ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ఆధార్, సెల్‌ఫోన్‌ నంబర్లు వివరాలు ఇవ్వనివారికి ఈ నెల జీతం రాదు’ అని ఇప్పటికే ఆర్థికశాఖ అన్ని ప్రభుత్వశాఖల అధిపతులను హెచ్చరించింది. అన్ని శాఖల్లో కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్‌ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్‌(IFMIS)లో నమోదు చేయాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు. ఈ క్రమంలో వివరాలివ్వనివారి జీతాల బిల్లులు నిలిపివేసింది. మిగిలిన వారు వెంటనే వివరాలు ఇవ్వాలని లేకపోతే.. ఇదే ట్రీట్మెంట్ అమలు అవుతుందని హెచ్చరించింది.

Next Story