అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం: మంత్రి పొంగులేటి

by Gantepaka Srikanth |

అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం: మంత్రి పొంగులేటి

అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం: మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: హౌసింగ్ బోర్డు భూములు ప‌రిర‌క్షణ‌కు, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన ప‌టిష్టమైన చ‌ర్యలపై స‌చివాల‌యంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌత‌మ్‌, సీఈ వెంక‌ట ర‌మణారెడ్డి అధికారుల‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) స‌మావేశం నిర్వహించారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు త‌దిత‌ర అంశాల‌పై ఈ సమావేశంలో సుధీర్ఘంగా చ‌ర్చించారు. ఒక‌వైపు భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటూనే మ‌రో వైపు లీజు, క‌మ‌ర్షియ‌ల్, అద్దెలు, రెగ్యుల‌రైజేష‌న్ త‌దిత‌ర అంశాల‌పై కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

నిజాం కాలం నుంచి 115 సంస్థల‌కు హౌసింగ్ బోర్డు భూముల‌ను లీజుకు ఇవ్వ‌డం జ‌రిగింది, ఇందులో ప్ర‌ధానంగా ఇనిస్ట్యూష‌న్స్‌, రెసిడెన్షియ‌ల్, క‌మ‌ర్షియ‌ల్‌, స్కూల్స్‌, టెంపుల్స్ త‌దిత‌రాలు ఉన్నాయి. ఏడు స్థలాల‌కు సంబంధించి కోర్టు కేసులు, అలాగే అద్దెబ‌కాయిలు ఉన్నాయి. లీజు అగ్రిమెంట్ పున‌రుద్ద‌ర‌ణ చేసుకోని సంస్ధ‌ల‌కు హౌసింగ్ బోర్డు త‌ర‌పున లేఖలు రాసి వాటి రెగ్యుల‌రైజేష‌న్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు. హౌసింగ్ బోర్డు నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి షాపు య‌జ‌మాని ప్ర‌తి ఏడాది 10శాతం అద్దెను పెంచుతూ షాపును రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని అయితే ఈ నిబంధ‌న అమ‌లు కాక‌పోవ‌డంతో షాపు య‌జ‌మానుల నుంచి హౌసింగ్ బోర్డుకు కోట్లాది రూపాయిలు రావ‌ల‌సి ఉంద‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు తెలుపగా.. ప్ర‌స్తుతం షాపులు నిర్వ‌హిస్తున్న‌వారు ఆ షాపుల‌ను కొనుగోలు చేయ‌డానికి ముందుకువ‌స్తే మార్కెట్ ధ‌ర ప్ర‌కారం విక్ర‌యించ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేయాల‌ని సూచించారు. అలాగే షాపు నిర్వ‌హ‌ణ‌కు అనువుగా లేక‌పోతే ఆ స్థలాన్నివేలంలో విక్ర‌యించాల‌ని చెప్పారు.

కోర్టు కేసుల‌లో ఉన్న భూములు హౌసింగ్ బోర్డుకు చెందేలా ప‌టిష్ట‌మైన వాద‌న వినిపించేలా ప్ర‌త్యేకంగా అడ్వ‌కేట్‌ను నియ‌మించుకోవాలని, హౌసింగ్ బోర్డు గ‌తంలో కేటాయించిన ఇండ్ల‌కు ప‌క్క‌నే ఉన్న వంద గ‌జాల లోపు స్థలాల‌ను ఆఇంటి య‌జ‌మానికి ఆస‌క్తి ఉంటే విక్ర‌యించాల‌ని అలాగే గ‌తంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజిస్ట్రేష‌న్ చేసుకోనివారికి ఇప్పుడు రిజిస్ట్రేష‌న్ అవ‌కాశం క‌ల్పించాల‌ని, ప‌క్క‌నే ఉన్న వంద గ‌జాల లోపు స్థలాన్ని కూడా కొనుగోలు చేసుకుంటే మొత్తం స్ధ‌లానికి రిజిస్ట్రేష‌న్ చేయించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని సూచించారు. మార్కెట్ ధ‌ర‌, స‌బ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ వంద గ‌జాల లోపు స్థలాల వివ‌రాలు, రిజిస్ట్రేష‌న్ కాని ప్లాట్ల వివ‌రాలు, రిజిస్ట్రేష‌న్ చేసుకొని ప‌క్క‌నే ఉన్న వంద గ‌జాల‌లోపు స్థలాన్ని అడుగుతున్నవారి వివ‌రాలు త‌దిత‌ర అంశాల‌పై పూర్తిస్ధాయి నివేదిక త‌యారుచేయాల‌ని అధికారుల‌కు సూచించడం జరిగింది.. వీట‌న్నింటిపై క్యాబినెట్‌లో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకోనున్నట్లు తెలిపారు.

Next Story