- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగూరు నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: ఎమ్మెల్యే హరీష్ రావు
మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతులు ప్రస్తుతం యాసంగి పంట సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతులు ప్రస్తుతం యాసంగి పంట సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ మరమ్మత్తుల పేరుతో ప్రభుత్వం నీటిని పూర్తిగా ఖాళీ చేయడం వల్ల రైతులు అగమ్యగోచర స్థితిలో పడిపోయారని ఆయన విమర్శించారు. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో ఈ పనులను పూర్తి చేసి ఉంటే, నేడు యాసంగి సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు అని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం నీటి విడుదలపై సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారని, వేల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హరీష్ రావు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సింగూరు మరమ్మత్తుల ప్రస్తుత స్థితిని, యాసంగి సాగుకు నీటిని ఎలా అందిస్తారో రైతులకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేసి, సాగు నీటి కష్టాలు తలెత్తకుండా చూడాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు.






