30 రోజుల్లో ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలి: శ్రీహరిరావు

by Disha Web Desk 19 |
30 రోజుల్లో ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలి: శ్రీహరిరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలతో పంటనష్టంతో రైతులు మనోధైర్యం కోల్పోకుండా పరిహారం చెల్లించాలని.. రాజకీయాలకు అతీతంగా గ్రామగ్రామాన గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో లేకుంటే గ్రామ రైతు కమిటీల ఆధ్వర్యంలో తీర్మానం చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కోరారు. తీర్మానం కాపీని కలెక్టర్లకు, సీఎస్‌కు మెయిల్ ద్వారా పంపాలని విజ్ఞప్తి చేశారు. వరి ఎకరాలకు 10వేలు తగ్గకుండా పరిహారంను ప్రకటించి 30 రోజుల్లోపు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం సైతం పరిహారం ఇచ్చేలా రాష్ట్రం కోరాలని, తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యానికి, మొక్కజొన్నలకు ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం కొనుగోలు చేయాలని, నష్ట పరిహారంతో పాటు రుణమాపీని పూర్తి స్థాయిలో చెల్లించాలని, వర్ష ప్రభావిత జిల్లాలను, మండలాలుగా ప్రకటించి రైతుల పంట రుణాలను రీ షెడ్యూల్ చేయించి కొత్త రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని, సమగ్ర పంటల బీమా పథకం ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానాలు చేయాలని కోరారు.

Next Story

Most Viewed