- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్హుడైన చివరి వ్యక్తికి సైతం ప్రభుత్వ పథకాలు.. మంత్రి జూపల్లి ఆక్తికర వ్యాఖ్యలు
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన కొనసాగుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishnarao) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన కొనసాగుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishnarao) స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కోడేరు మండల పరిధిలో పథకాల ఎంపికపై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ నిరుపేదకు సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన(People Governance) కొనసాగుతోందని చెప్పారు. కోడేరు మండల(Koderu Mandal) పరిధిలోని పసుపుల గ్రామంలో(Pasupula Village) రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
అంతేగాక లబ్ధిదారుల జాబితా ఆధారంగా అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి అర్హులైన వారిని ఎంపిక చేశారా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, ఎంపిక కాని లబ్ధిదారుల పేర్లను రాసుకున్నామని వివరించారు. జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. చివరి వరుసలో ఉండే అర్హుడైన వ్యక్తికి సైతం ప్రభుత్వ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆర్థిక అవరోధాలు ఉన్నా.. ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూచ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని జూపల్లి తెలియజేశారు.






