- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కాలర్షిప్ బకాయిలు రూ.365.75 కోట్లు విడుదల చేసిన సర్కార్
by Muthe.Rajitha |
విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసింది. మొత్తం రూ.365.75 కోట్ల పెండింగ్ బకాయిలను సోమవారం ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ బకాయిల్లో ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.191.63 కోట్లు విడుదల కాగా, గిరిజన సంక్షేమ శాఖకు రూ.152.59 కోట్లు విడుదల అయ్యాయి. ఇక బీసీ సంక్షేమ శాఖకు రూ.21.62 కోట్లు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయం నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ పూర్తిగా విడుదల చేశామని తెలిపారు. విద్యార్థులు సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి ఎఫెక్ట్ విద్యార్థులు మీద పడనీయమని పేర్కొన్నారు.
Next Story






