ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా సర్కార్.. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-23 06:47:50  IST  )

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ భేటీ తర్వాత సానుకూల ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా సర్కార్.. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోన్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో నిన్న రాత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామిలు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆర్టీసీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఐఏఎస్ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై వీరు చర్చించినట్లుగా సమాచారం.

నేటి కేబినెట్ భేటీపై తీవ్ర ఉత్కంఠ..

సచివాలయం వేదిక ఇవా మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఆర్‌టీసీ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి ప్రాథమిక నివేదికను అందజేసింది. క్యాబినెట్ భేటీ అనంతరం ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం మంత్రుల కమిటీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కార్మికుల ప్రధాన డిమాండ్లైన వేతన సవరణ, పెండింగ్ బకాయిలు, ఇతర సంక్షేమ పథకాలపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story