- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ అధికారులా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా? : ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఆగ్రహం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Shravan) ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Shravan) ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులే(Ration Cards) ఇవ్వలేదని మాట్లాడిన ఐపీఎస్ దేవేంద్ర సింగ్ చౌహన్, ఐఏఎస్ హరిచందనలపై మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ... సీఎం, మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయ పడి కాంగ్రెస్ కార్యకర్తల్లా పచ్చి అబద్దాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. సర్వీస్ రూల్స్ ను ఉల్లంఘించిన దేవేంద్ర చౌహన్, హరిచందనలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
ప్రతిపక్షానికి రాజకీయంగా నష్టం చేసి పాలక పక్షానికి లాభం చేకూర్చేలా వారిద్దరూ పని చేయడం దారుణం అన్నారు. ఢిల్లీ వెళ్లి DOPT కి కూడా వారిద్దరిపై ఫిర్యాదు చేయబోతున్నామని, పార్లమెంటు లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతామని శ్రవణ్ పేర్కొన్నారు.






