Sandeep Kumar Jha: ప్రోటోకాల్ వివాదం.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ప్రభుత్వం నోటీసులు

by Prasad Jukanti |   (  Updated:2025-09-18 12:10:20  IST  )

Sandeep Kumar Jha: ప్రోటోకాల్ వివాదం.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ప్రభుత్వం నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు (Sandeep Kumar Jha) మరో షాక్ తగిలింది. నిన్న ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదంలో (Protocol Controversy) ఆయనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రొటోకాల్ వివాదంపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. నిన్న ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి కలెక్టర్ ఆలస్యంగా హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ ను (Aadi Srinivas) ప్రభుత్వం పంపించగా ఆయనకు స్వాగతం కూడా పలకలేదు. కలెక్టర్ తీరుపై ఆది శ్రీనివాస్ సీఎంవోకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.

నిన్నే హైకోర్టు వారెంట్:

ప్రోటోకాల్ వివాదం ఇలా ఉంటే నిన్న మిడ్ మానేరు నిర్వాసితుడికి పరిహారం విషయంలో సందీప్ కుమార్ ఝాకు తెలంగాణ హైకోర్టు వారెంట్ జారీ చేసింది. తన ఇంటిని కోల్పోయిన చీర్లవంచకు చెందిన నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్య నష్టపరిహారం విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించనందుకు కలెక్టర్‍కు వారెంట్ చేరిచేసింది. నిన్న హైకోర్టు వారెంట్ ఇవాళ ప్రభుత్వం నోటీసులతో ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా తీరు ప్రభుత్వ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story