ట్యాక్స్ కట్టేవారిపై సర్కార్ డేగకన్ను.. ‘లార్జ్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్’ ఏర్పాటు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-27 17:19:57  IST  )

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో భారీ పన్ను చెల్లింపుదారుల పర్యవేక్షణ కోసం ‘లార్జ్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్’ (LTU) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాక్స్ కట్టేవారిపై సర్కార్ డేగకన్ను.. ‘లార్జ్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్’ ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అత్యధికంగా పన్ను చెల్లింపుదారుల పర్యవేక్షణ కోసం ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర స్థాయిలో లార్జ్ ట్యాక్స్ ఫేయర్స్ యూనిట్(ఎల్‌టీయూ)ను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ యూనిట్‌కు జాయింట్ కమిషనర్ లేదా అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ ఎస్‌జీఎస్‌టీ చెల్లించేవారు, భారీగా జీఎస్‌టీ రీఫండ్ క్లెయిమ్ చేసేవారు, మద్యం, పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం చేసే ప్రధాన వ్యాట్ పన్ను చెల్లింపుదారులను ఈ యూనిట్ పరిధిలోకి తీసుకురానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ జాబితాను సవరించనున్నారు. దీంతో పాటు వాణిజ్య పన్నుల శాఖలో 19 డివిజన్లు, 121 సర్కిళ్లు ఉన్నాయి. అయితే, అబిడ్స్ ఎస్టీయూ-3, పంజాగుట్ట ఎస్టీయూ-3, బేగంపేట ఎస్టీయూ-3, వరంగల్ ఎస్టీయూ-2 పోస్టులను కొత్తగా ఏర్పడే స్టేట్ ఎల్‌టీయూకి బదిలీ చేయనున్నారు. ఈ యూనిట్‌కు అవసరమైన డెస్క్‌టాప్‌లు, ప్రింటర్లు, స్కానర్లు, ఫర్నిచర్ కొనుగోలు కోసం 2026-27 బడ్జెట్ కేటాయింపులో భాగంగా రూ.2.61కోట్ల నిధులను కేటాయించారు.

Next Story