TG: సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ కీలకమే!

by Gantepaka Srikanth |

TG: సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ కీలకమే!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ పంచాయతీ నిధుల విషయంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ సంతకాలు చేసిన చెక్కులకు మాత్రమే చెల్లింపులు చేయాలని సోమవారం ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇద్దరి సంతకాలు ఉంటేనే బ్యాంకులు చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరియు పాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు ఈ నిబంధన అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, మూడు విడతల సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది. కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. పలుచోట్ల సీపీఎం, సీపీఐ శ్రేణులు కూడా సత్తా చాటారు.

Next Story