- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టు జడ్జిగా జస్టిస్ దోనాడి రమేశ్.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్
రాష్ట్రంలో స్టేట్ లెవెల్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్టేట్ లెవెల్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరోవైపు హైకోర్టు (High Court)లో న్యాయమూర్తుల కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court Collegium) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేశ్ (Donadi Ramesh)ను నియమించింది. ప్రస్తుతం ఆయన అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court)లో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా సుప్రీం కొలీజియం ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదించడంతో దోనాడి రమేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై రానున్నారు. అయితే, ఆయన నియామకానికి సంబంధించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులైన ఆయన 2023 జూలైలో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ బస్తీ, సిద్ధార్థ్‌నగర్ జిల్లాలకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్‌గా పని చేశారు. తాజా, ఆదేశాల మేరకు తిరిగి దోనాడి రమేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రానున్నారు.






