- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Damodara Rajanarsimha : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం : దామోదర రాజనర్సింహ
ఆశావర్కర్ల(Asha Workers) సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha) పేర్కొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆశావర్కర్ల(Asha Workers) సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha) పేర్కొన్నారు. వారి డిమాండ్స్ ను బట్టి.. ఒక్కొక్కటీ పరిష్కరించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. విపక్షాల కుట్రలో ఇరుకోవద్దని, వారి ఉచ్చులో పడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని హితవు పలికారు. ధర్నా చౌక్ నే మాయం చేసిన వాళ్ళు.. మీ ధర్నాలకు వారు అండగా ఉంటామనడం హాస్యాస్పదం అన్నారు. ఆశాలకు ఇప్పుడు మద్ధతు తెలపడం కంటే.. పదేళ్ళ కాలంలో వారి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని మంత్రి నిలదీశారు. అప్పుడే వారి డిమాండ్స్ తీర్చి ఉంటే ఇప్పుడు వారు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని వెల్లడించారు.
Next Story






