- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధం.. వచ్చే నెల 3 నుంచి సీఎం జిల్లా పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైంది. 2025, డిసెంబర్ 29 రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 1, 2026న ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా విడుదల కానుంది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత జనవరి 10న తుది ఓటర్ల జాబితా ప్రచురితమవుతుంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వచ్చేనెల 3 నుంచి జిల్లాల్లో పర్యటనలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో అదే రోజు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ఈ పర్యటన ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ శ్రేణలు తెలిపాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.






