నేతన్నలకు భారీ గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

నేతన్నలకు(Weavers) సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది.

నేతన్నలకు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : నేతన్నలకు(Weavers) సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. నేతన్నలకు రూ.లక్షలోపు గల అన్ని రుణాలను మాఫీ(Waiver of loans) చేసింది. ఈ మేరకు వారి ఖాతాల్లోకి రూ.19. కోట్లు జమ చేసినట్టు పేర్కొంది. 2017 నుంచి 2024 మార్చి వరకు నేతన్నలు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను పరిగణలోకి తీసుకుంటూ.. వాటిని మాఫీ చేసింది. చేనేత వస్త్రాల ఉత్పత్తి, నిర్వహణ, నేత వృత్తి సంబంధిత రుణాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. కాగా తమ రుణాలు మాఫీ చేసినట్టు ఫోన్లకు మెసేజిలు వస్తుండటంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ... సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story