భూభారతి పోర్టల్‌‌పై అనుమానాలున్నాయా?.. ఈ వీడియో చూడండి ఫుల్ క్లారిటీ వస్తుంది!

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-14 16:20:08.0  )
భూభారతి పోర్టల్‌‌పై అనుమానాలున్నాయా?.. ఈ వీడియో చూడండి ఫుల్ క్లారిటీ వస్తుంది!
X

దిశ, వెబ్‌డెస్క్: ధరణి పోర్టల్‌(Dharani Portal)ను బంగాళాఖాతంలో కలుపుతామని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అన్నంతపని చేసేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న భూభారతి పోర్టల్‌ సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మంత్రులు, అధికారులు, మేధావుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే కొత్త చట్టంపై అన్నదాతలకు అవగాహన కలిగేలా ఓ వీడియోను రూపొందించారు. అందులో రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. అంతకుముందు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పండుగ వాతావరణంలో భూభారతిని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. భూభారతి(Bhu Bharathi Porta) ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed