- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అంబేద్కర్ జయంతి వేళ దళితులకు ప్రభుత్వం భారీ శుభవార్త
అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanthi) వేళ దళితులకు ప్రభుత్వం(Telangana Government) భారీ శుభవార్త చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanthi) వేళ దళితులకు ప్రభుత్వం(Telangana Government) భారీ శుభవార్త చెప్పింది. రేపటి నుండి(ఏప్రిల్ 14) రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ( SC Classification) అమలులోకి రానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ప్రకటించారు. ఆదివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. మంత్రివర్గ ఉపసంఘం ఎస్సీ వర్గీకరణ చట్టానికి తుది రూపం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలులోకి తెచ్చామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ తొలి ప్రతిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లు ఉత్తమ్ కమార్ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సబ్ కమిటీ, ఉపాధ్యక్షుడు దామోదర్ రాజనరసింహా, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో పాటు ఎస్సీ వర్గీకరణ కమిషన్‌కు అధ్యక్షత వహించిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జస్టిస్ షమీమ్ మక్తర్ ఆధ్వర్యంలో కమిషన్ రూపొందించిన సిఫారసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం వర్గీకరణ చట్టాన్ని ఆమోదించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 59 ఎస్సీ ఉప కులాల మధ్యన ఉన్న అంతర్గత వెనుకబాటు తనాన్ని ఆధారం చేసుకుని మూడు గ్రూపులుగా విభజించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణను ఏకగ్రీవంగా ఆమోదించుకోవడంతో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదించిన విషయాన్ని ఆయన ఉటంకించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణాలో ఎస్సీల జనాభా 17.5 శాతానికి చేరిందని 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఎస్సీలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లను పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.






