- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ బడులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని సర్కారు బడులకు(Govt Schools) మహర్దశ పట్టబోతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని సర్కారు బడులకు(Govt Schools) మహర్దశ పట్టబోతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై సాంకేతిక టెక్నాలజీతో విద్యాబోధన జరగనుంది. డిజిటల్ తరగతులు, AI క్లాసుల కోసం ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్(Free Internet) అందించనున్నట్టు సర్కారు(Telangana GoVT) నిర్ణయం తీసుకుంది. రానున్న 6 నెలల్లో 11,476 పాఠశాలల్లో ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. కేంద్రంలో రాష్ట్రానికి జరిగిన ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 5,992 స్కూళ్ళలో బీఎస్ఎన్ఎల్ ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్న విషయం తెలిసిందే.
వీటితోపాటు మరో 5,992 పాఠశాలలకు కూడా ఉచిత ఇంటర్నెట్ ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్ కు రాష్ట్ర విద్యాశాఖ ఈ మేరకు లేఖ రాసింది. రానున్న ఆరునెలల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం రానుండటం పట్ల, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






