- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaleswaram: సరస్వతీ పుష్కరాలు.. సర్కార్ మరో కీలక నిర్ణయం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleswaram)లో సరస్వతీ పుష్కరాలు(Saraswati Pushkaralu) వైభవంగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleswaram)లో సరస్వతీ పుష్కరాలు(Saraswati Pushkaralu) వైభవంగా కొనసాగుతున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి భక్తులు వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి.. శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. నదిలో సరస్వతీ మాతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సరస్వతీ నవరత్నమాల హారతి ఘట్టాన్ని ప్రతీ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు నేటి నుండి ఈ హారతి కార్యక్రమాన్ని లైవ్ కవరేజీ చేయనున్నారు. ప్రతీ రోజు సాయంత్రం నిర్వహించే సరస్వతీ హారతిని ఇవ్వడానికి, కాశీలో అత్యంత ప్రజాదరణ పొందిన గంగా హారతినిచ్చే(Ganga Harathi) పండితులను ప్రత్యేకంగా ప్రభుత్వం పిలిపించింది. దాదాపు అరగంట పాటు సాగే సరస్వతి నవరత్నమాల హారతిలో తొమ్మిది ప్రత్యేక హారతులను ఇస్తారు.
సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో తొమ్మిది హారతులు
1. ఓంకార హారతి.. సర్వ దోష నివారిణి
2. నాగ హారతి - సర్పదోషాని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది
3. పంచ హారతి - దీర్ఘాయుష్షుకు
4. సూర్య హారతి - రోగాలను మాపి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
5. చంద్ర హారతి - పాడి పంటలను, మన: శాంతినిస్తుంది.
6. నంది హారతి - ధర్మ బుద్ధిని, శక్తిని, విద్య బుద్ధినిస్తుంది.
7. సింహ హారతి - నాయకత్వాన్ని ధైర్యాన్నిస్తుంది.
8. కుంభ హారతి -సంపదను ఇచ్చి, కోటి సుఖాలను అందిస్తుంది.
9. నక్షత్ర హారతి - నిర్మలమైన మనస్సును, కీర్తిని అందిస్తుంది.






