- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగులకు ప్రకటించిన ఒక డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా సగటున సుమారు రూ.200 కోట్లు.. ఏడాదికి దాదాపు రూ.2,400 కోట్ల అదనపు భారం ఖజానాపై పడనుందని ఆర్థికశాఖ వర్గాలు లెక్కలు తీశాయి. జూలైలో చెల్లించే జీతంతో పాటు పెరిగిన డీఏను ఎంప్లాయీస్ ఖాతాలో వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే ఏరియర్స్‌ను సైతం వీలు చూసుకుని ఉద్యోగులకు చెల్లించనున్నారు. ఓ వైపు పెద్ద ఎత్తున అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూస్తూనే మరోవైపు ఎంప్లాయీస్ సంక్షేమానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటి నుంచి ప్రతినెలా రూ.700 కోట్లను రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మరో 6 డీఏలు పెండింగ్..
2026 నాటికి మొత్తంగా 6 డీఏలు పెండింగ్‌లో ఉంటాయనే డిస్కషన్ ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం నెలకొన్నది. ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో ఒకటి ఇప్పుడు చెల్లించి, మరో డీఏను 2026 ఎప్రిల్‌లో చెల్లించనున్నారు. కానీ, ఈలోపే వచ్చే నెల చివరన(జూలై 30లోపు) కేంద్రం ఒక డీఏను, వచ్చే ఏడాది జనవరి చివరన మరో డీఏను ప్రకటించనుంది. దీంతో రాష్ట్ర ఉద్యోగులకు మొత్తంగా మళ్లీ 6 డీఏలు పెండింగ్‌లో ఉంటాయని చర్చ జరుగుతున్నది. అయితే, సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం త్వరలో వైద్యశాఖ అధికారులు, జీఏడీ అధికారులతో ఒక కమిటీ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న పథకాలను అధ్యయనం చేసి మెరుగైన స్కీమ్‌ను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.






