టైగర్ రిజర్వ్ టూరిజంపై ప్రభుత్వం ఫోకస్.. రూ.875 కోట్లు కేటాయింపు

by Naga Rani Yarlagadda |

టైగర్ రిజర్వ్ టూరిజంపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. బడ్జెట్ లో దీనికోసం కొన్ని నిధులు కేటాయించింది.

టైగర్ రిజర్వ్ టూరిజంపై ప్రభుత్వం ఫోకస్.. రూ.875 కోట్లు కేటాయింపు
X
  • ఇంటిగ్రెటెడ్ వైల్డ్ లైఫ్ నిర్వహణకు రూ.37 కోట్లు

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజం, టైగర్ రిజర్వ్ టూరిజంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అభివృద్ధి చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర బడ్జెట్ లో కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.875 కోట్లు కేటాయించింది. పులుల సంరక్షణతోపాటు సందర్శుల కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు చేయనున్నారు. దీంతోపాటు కొత్త యూనిట్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు వన్య ప్రాణుల నిర్వహణను ఇంటిగ్రేట్ చేయడానికి బడ్జెట్ లో రూ.37జ48కోట్లు కేటాయించారు.

Next Story