- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ.. ఆగస్టు చివరి నాటికి మూడు ప్లాన్లు సిద్ధం!
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరో 25 ఏండ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లో ఉండాల్సిన కాంపోనెంట్స్‌పై కసరత్తు చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరో 25 ఏండ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లో ఉండాల్సిన కాంపోనెంట్స్‌పై కసరత్తు చేస్తున్నారు. హెచ్ఎండీఏ ఎనిమిది జిల్లాల నుంచి 11 జిల్లాల వరకు విస్తరించిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ ఆథారిటీ (ఎఫ్‌సీడీఏ), యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ)లను కలుపుతూ మాస్టర్ రూపొందించడానికి చర్యలు ప్రారంభించారు. అయితే మాస్టర్ ప్లాన్‌లోని ప్రజా రవాణాకు సంబంధించిన కాంప్రహెన్సివ్ మొబులిటీ ప్లాన్(సీఎంపీ), ఆర్థిక పరమైన అభివృద్ధికి సంబంధించి ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఈడీపీ), నీటి వనరులు, పార్కులు, గ్రీనరీ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన బ్లూ, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఆధారంగా మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరిన విషయం తెలిసిందే.
నెలాఖరుకు ఆ మూడు రెడీ
ఆగస్టు చివరి నాటికి మూడు ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో మొబులిటీ ప్లాన్‌లో ప్రజా రవాణా, ప్రైవేటు రవాణా మార్గాల అభివృద్ధి కోసం నేషనల్ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ పాలసీ (ఎన్యూడీపీ) 2006/2014కు లోబడి ఆచరణాత్మకమైన దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించారు. ప్రపంచంలోని పది నగరాల జాబితాలో హైదరాబాద్ ఉండేలా ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్లాన్ రూపొందించారు.
11,328 చ.కిలోమీటర్లకు ఒకే బేస్ మ్యాప్
హెచ్ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లో బేస్ మ్యాప్ కీలకంగా మారింది. హెచ్ఎండీఏ 10,472.72 చదరపు కిలోమీటర్లు, ఫ్యూచర్ సిటీ 765.28 చ.కిలోమీటర్లు, యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ ఆథారిటీ పరిధి 90 చ.కిలోమీటర్ల మొత్తం 11,328 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒకే బేస్ మ్యాప్ చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్ని రకాల ఆస్తులను జియో బేస్ మ్యాప్‌లో పొందుపర్చనున్నారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్ఫీ) పిలవనున్నారు. దీంతోపాటు బేస్ మ్యాప్ కోసం ఆర్ఎఫ్పీ పిలవనున్నారు. బేస్ మ్యాప్ కోసం 12 నెలలు సమయం పట్టే అవకాశముంది.






