ఆ ఈవెంట్‌ మరో మైలురాయి కాబోతోంది: వల్లూరు కాంతి

by Gantepaka Srikanth |

ఆ ఈవెంట్‌ మరో మైలురాయి కాబోతోంది: వల్లూరు కాంతి

ఆ ఈవెంట్‌ మరో మైలురాయి కాబోతోంది: వల్లూరు కాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని ప్రముఖ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్‌లలో ఒకటైన ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ (ఐఐటీఎమ్) గురువారం హైదరాబాద్‌ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ 4 నుండి 6 వరకు జరుగనున్నఈ కార్యక్రమం భారతీయ, అంతర్జాతీయ ప్రయాణ రంగాల విశాల సామర్థ్యాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ముఖ్య వేదికగా నిలవనుంది. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల ప్రయాణ, హాస్పిటాలిటీ, ప్రభుత్వ రంగాల స్టాల్స్‌తో పాటు కొన్ని విదేశీ పర్యటక సంస్థలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేసారు. ట్రావెల్ వ్యాపారాల మధ్య అనుసంధానం, పర్యటన అవకాశాల ప్రోత్సాహం ఈ రంగ అభివృద్ధికి దోహదపడే మరో మైలురాయిగా ఈ ఈవెంట్ నిలిచింది. నెట్‌వర్కింగ్, భాగస్వామ్యం, డెస్టినేషన్ ప్రమోషన్‌కు అపూర్వ అవకాశాలను అందిస్తోంది. ఈ ఎడిషన్‌లో 10 దేశాల నుండి, 25 రాష్ట్రాల నుండి 200కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా స్ఫియర్ ట్రావెల్ మీడియా డైరెక్టర్ సంజయ్ హాఖూ మాట్లాడుతూ.. వ్యాపారాలను అనుసంధానం చేసి, అర్థవంతమైన భాగస్వామ్యాలను ఏర్పరచడం ఐఐటీమ్ హైదరాబాద్ 2025 ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Next Story