విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ఖరారు చేసిన ప్రభుత్వం

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10 నుండి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు అమల్లో ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ఖరారు చేసిన ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10 నుండి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు అమల్లో ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం జనవరి 15న సంక్రాంతి పండుగ ఉండగా, జనవరి 16న కనుమను ఆప్షనల్ హాలిడేగా పేర్కొన్నారు. సెలవుల అనంతరం రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు జనవరి 17న తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ డైరెక్టర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను విద్యాశాఖ ఆదేశించింది. 2025-26 విద్యా సంవత్సరం క్యాలెండర్ ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story