- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: కులాంతర వివాహాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
కులాంతర వివాహం చేసుకున్న జంటలకు తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: కులాంతర వివాహాలను ప్రొత్సహించేందుకు, కులాంతర పెళ్లిల్లు చేసుకున్న దళితులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా కూడా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఈ పథకం కింద 2 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది. అయితే జంటల్లో వధువు లేదా వరుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ఎస్సీ అయి ఉండటంతో పాటు ఆ వివాహం చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉండాలనే నిబంధన ఉన్నది. తెలంగాణ ఆవిర్బావం నుంచి ఈ ఆర్ధిక సంవత్సరం వరకూ ఈ పన్నెండు ఏళ్లలో 13,4199 కులాంతర వివాహాలు కాగా, వారికి దాదాపుగా రూ.238.17 కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం అందింనట్లుగా అధికారులు వివరాలు అందించారు.
ప్రతి ఏడాది వారీగా పరిశీలిస్తే 2014-15 ఏడాదిలో 459 వివాహాలు కాగా రూ.2.10కోట్ల ఆర్దిక సాయం అందించారు. 2015-16 ఏడాదిలో 800 పెళ్లిల్లు కాగా, రూ.3.81కోట్ల ఆర్ధిక సాయం, 2016-17లో 1009 పెళ్లిల్లు కాగా, రూ.4.89కోట్లు, 2017-18లో 646 పెళ్లిల్లు కాగా, రూ.3.21కోట్లు, 2018-19లో 734 వివాహాలకు, రూ. 3.64కోట్లు, 2019-20లో 918 వివాహాలకు, రూ. 4.63కోట్లు, 2020-2021లో 760 వివాహాలకు, రూ. 13.92కోట్లు, 2021-22 563 వివాహాలకు, రూ. 13.72కోట్లు, 2022-23లో 418 వివాహాలకు రూ.10.45 కోట్లు, 2023-24 వివాహాలకు, రూ. 6.07కోట్లు, 2024-25 383 వివాహాలకు, 9.58కోట్లు, ఈ ఆర్ధిక సంవత్సరం 2025-26లో ఇప్పటి వరకూ 1259 వివాహాలకు ఇప్పటి వరకూ రూ. 31.48 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించారు. మొత్తం ఈ పన్నెండు ఏళ్లలో 13,419 వివాహాలకు 238.17 కోట్ల ఆర్ధిక సాయాన్ని వారికి అందిజేసినట్లుగా అధికారులు చెప్పారు. గత పన్నెండు ఏళ్లలో పోలిస్తే ఈ ఏడాదిలోనే ఎక్కువ వివాహాలు, ఎక్కువ ఆర్ధికసాయాన్ని అందజేశారు.
నేరుగా ప్రయోజనం చేకూరేలా పథకం అమలు : మంత్రి అడ్లూరి
కొన్ని జిల్లాల్లో నిధుల వినియోగ శాతం తక్కువగా ఉన్న అంశాన్ని ప్రభుత్వం గుర్తించిందని, దరఖాస్తుల కొరత, అవగాహన లోపం వంటి సమస్యలను పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని, జిల్లా స్థాయి సమీక్షలు, ప్రత్యేక ప్రచారం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నామని, ఇది కేవలం ఆర్థిక సహాయం కాదని, కుల వివక్షను తొలగించే దిశగా తమ ప్రభుత్వం ఒక సామాజిక సంకల్పంతో ముందుకెళ్తోందని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు.






