- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీ పేరుతో బురిడి.. బెదిరింపులకు భయపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏసీబీ దాడులను అడ్డం పెట్టుకుని కేటుగాళ్లు ప్రభుత్వ అధికారులను బురిడి కొట్టిస్తున్నారు. ఏసీబీ అధికారుల పేరు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు.

- రూ.98 వేలు ఫోన్ పే చేసిన టేకులపల్లి డిప్యూటి తహసీల్దార్
- గతంలో ఓ ఎమ్మార్వోను బెదిరింపు కాల్స్
- వెటర్నరి జాయింట్ డైరక్టర్ కు ఏసీబీ పేరుతో బెదిరింపులు
- అప్రమత్తంగా ఉండాలని ప్రతి నెల ప్రకటనలు చేస్తున్న ఏసీబీ డిపార్ట్మెంట్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏసీబీ దాడులను అడ్డం పెట్టుకుని కేటుగాళ్లు ప్రభుత్వ అధికారులను బురిడి కొట్టిస్తున్నారు. ఏసీబీ అధికారుల పేరు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులలో ఉన్న భయాన్ని తమ ఆదాయ వనరుగా మరల్చుకుంటున్నారు. ఫేక్ ఫోన్ కాల్స్ నమ్మవద్దని ఏసీబీ విభాగం ఉన్నతాధికారులు పలుమార్లు పత్రిక ప్రకటనలు చేసిన ప్రభుత్వ అధికారులు మాత్రం కేటుగాళ్ల బురిడిలకు మోసపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట ప్రభుత్వ అధికారులు ఏసీబీ పేరు చెప్పి మోసాలకు పాల్పడే వారికి చిక్కుతున్నారు. మోసపోయిన వారిలో ఉన్నతాధికారులు సైతం ఉండటం ఆందోళనకు గురి చేస్తుంది.
మరో వారంలో పదవీ విరమణ చేయబోతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టెకులపల్లి డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)ను బోల్తా కొట్టించి దాదాపు రూ.98వేలు కొట్టేశారు. డీటీగా ఉన్న పోలూరి ముత్తయ్యకు తహసీల్దారుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. టేకులపల్లి తహసీల్దార్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారినంటూ చెప్పిన అవతలి వ్యక్తి మీ ఆఫీసులో పని చేస్తున్నా ఆర్ఐ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని ముత్తయ్యకు తెలిపారు. మీ పేరు కూడా చెబుతున్నాడు అంటూ ముత్తయ్యను బెదిరింపులకు పాల్పడ్డారు. కేసు నమోదు కాకుండా ఉండాలంటే వెంటనే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారం రోజులలో రిటైర్ మెంట్ ఉండటంతో ఆందోళన చెందిన ముత్తయ్య తన గూగుల్ పే నుంచి మంజుగౌరి అనే పేరిట ఉన్న ఖాతాకు రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.5 వేలు, రూ.3 వేలు ఇలా 4 విడతల్లో మొత్తం రూ.98 వేలు బదిలీ చేశారు. కాసేపటి తర్వాత ఏసీబీ అధికారిని అని చెప్పి మాట్లాడిన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తహసీల్దార్ ముత్తయ్య తాను మోసపోయానని గ్రహించారు. మోసగాడు చాకచక్యంగా బురిడీ కొట్టించడంతో ఆర్ ఐ, తహసీల్దార్ ఇద్దరూ తలలు పట్టుకున్నారు.
గతంలో ఏసీబీ ఇన్ స్పెక్టర్ ని అంటూ మహబూబ్ నగర్ జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ కు బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తిని ఎల్ బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈజీగా మనీ సంపాదించేందుకు నాగర్ కర్నూలుకు చెందిన ఏఎఆర్ హెడ్ కానిస్టేబుల్ , మరి కొందరితో కలిసి ఏసీబీ అధికారులమంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. 8 మంది వద్ద రూ.3 లక్షల40 వేలు వసూలు చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.
ఇదే తరహ ఘటన ఫిబ్రవరి నెలలో వరంగల్ పరిధిలో చోటు చేసకుంది. ఓ తహసీల్దారును బురిడీ కొట్టించారు. ఏసీబీ అధికారుల పేరుతో బెదిరించి రూ.75వేలు ఫోన్ పే చేయించుకున్నారు. కొద్దిసేపటి తరువాత తేరుకున్న తహసీల్దారు తాను మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.
మార్చి నెలలో ఏసీబీ అధికారుల పేరిట ఓ ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేశారు. ఫోన్ కాల్ ద్వారా ఏసీబీ అధికారిగా తనను పరిచయం చేసుకుని ఉద్యోగిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, విచారణ చేసేందుకు బ్యాంక్ వివరాలతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను కోరాడు. అలాగే అతడిని అరెస్టు చేయాల్సి వస్తుందని బెదిరించారు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే తాము అడిగిన డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. భయపడిన ఉద్యోగి రెండు మొబైల్ నంబర్లకు మొత్తం రూ.లక్ష ట్రాన్స్ ఫర్ చేశాడు. అనంతరం ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపగా, వారు మోసం పోయామని గ్రహించి బాధితుడితో సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తున్న ఎసీబీ ఉన్నతాధికారలు తెలుపుతున్నారు. ఏసీబీ విభాగానికి చెందిన అధికారులు నుంచి ఫోన్ లే రావని ఈ విషయం ప్రభుత్వ అధికారులు గుర్తించుకోవాలన్నారు. లంచం విషయంలో మాత్రం ఏసీబీ అధికారులు పూర్తి సమాచారంతో మాత్రమే దాడులు నిర్వహిస్తారని తెలుపుతున్నారు.






