- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ అధికారులపై అభ్యంతర వ్యాఖ్యలు..రంగంలోకి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు
రాష్ట్రంలో మహిళా అధికారులు, ప్రభుత్వంలోని ముఖ్యులను లక్ష్యంగా చేసుకొని తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేస్తున్న వైనాన్ని డిప్యూటి కలెక్టర్ అసోసియేషన్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, రెవెన్యూ ఉద్యోగుల జేఏసీలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటనలు చేశాయి.

మహిళ అధికారుల పై అభ్యంతర వ్యాఖ్యలు
క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల డిమాండ్
డిప్యూటి కలెక్టర్ అసోసియేషన్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, రెవెన్యూ జేఏసీ సంఘాల ఖండన
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మహిళా అధికారులు, ప్రభుత్వంలోని ముఖ్యులను లక్ష్యంగా చేసుకొని తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేస్తున్న వైనాన్ని డిప్యూటి కలెక్టర్ అసోసియేషన్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, రెవెన్యూ ఉద్యోగుల జేఏసీలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటనలు చేశాయి. సంఘాల తరపున తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల ఛైర్మన్, డిప్యూటి కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, డిప్యూటి కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ ఆదివారం ప్రకటన చేశారు. సమాజంలో ఏ రకంగానూ సరైన పద్ధతి కాదని తెలిపారు. వార్తా మాధ్యమాలు వాటి సొంత ప్రయోజనాల కోసమో, సెన్సేషనలిజం కోసమో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఏ మాత్రం సమంజసం కాదని విమర్శించారు. మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకొని వార్తలు ప్రసారం చేసిన వార్తామాధ్యమాలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కావని ప్రజానికానికి హామీ ఇవ్వాలని తెలిపారు. తప్పుడు వార్తలు ప్రసారం కాకుండా నియంత్రణ సంస్థలు, జర్నలిస్టు సంఘాలు సైతం చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.






