- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Doctors Association: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం
సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చారిత్రాత్మకమైన నిర్ణయం అని ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చారిత్రాత్మకమైన నిర్ణయం అని ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ పేర్కొన్నారు. ఉద్యమంలోని ప్రజల ఆలోచనలు, స్ఫూర్తి, వంటి ప్రతిరూపాలు తెలంగాణ తల్లి విగ్రహంలో ఆవిష్కృతమయ్యాయని వివరించారు. సోమవారం ఆయన సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ తర్వాత మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వైద్యులు, వైద్యుల సంఘాలను గుర్తించి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానాలు అందజేశారన్నారు. ఇది మంచి పరిణామం అన్నారు. ఉద్యమ సమయంలో పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనత వైద్యులకే దక్కుతుందన్నారు. వంద లాది వైద్యులు టియర్ గ్యాస్‌లు, రబ్బర్ బుల్లెట్లు దాడికి గురై ఆరోగ్య పరంగా నష్టపోయారన్నారు. సకల జనుల సమ్మె, మిలినియన్ మార్చ్, వైద్య గర్జన లాంటి కార్యక్రమాలతో తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ వైద్యులు చొరవ చూపారన్నారు. ఈ కార్యక్రమంమలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుధీర్, అన్నపూర్ణ, మాధవి, సంధ్య, వినోద్, రాజశేఖర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.






