- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: ఇందిరమ్మ రాజ్యం అని గప్పాలు కొట్టి ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తారా?: కవిత
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఉద్దేశపూర్వకంగానే ఫీజు రియింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిలను ఎగవేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) విమర్శించారు. ఇది కమిషన్ల సర్కార్ అని.. 20 శాతం కమీషన్లు ఇస్తేనే రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇ్సతామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల అంశంపై ఇవాళ ఎక్స్ లో పోస్టు చేసిన కవిత.. కమిషన్ల కోసమే బకాయిలు ఏళ్లకేళ్లుగా పెండింగ్ పెట్టడంతో ఇప్పటికే కాలేజీలు నడపలేక యాజమాన్యాలు ఆర్థికంగా చితికిపోయాయన్నారు. కాలేజీలు మూతపడితే ఆడబిడ్డలు చదువులకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆడబిడ్డలను చదువులకు దూరం చేస్తోందని దుయ్యబట్టారు.
విద్యార్థుల భవిష్యత్ పై బాధ్యతతో ఉన్నాం:ప్రతి విద్యార్థి భవిష్యత్తు పట్ల ప్రజా పాలనలో తాము బాధ్యతాయుత దృష్టితోనే ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. వృత్తి విద్య కళాశాలలు ఇవాళ్టి నుంచి నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు సమాఖ్య ప్రకటించిన నేపథ్యంలో నిన్న రాత్రి ప్రజా భవన్ లో కాలేజీల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి ఇవాళ భట్టి విక్రమార్క తన ఎఫ్ బీలో పోస్టు చేశారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో నిన్న రాత్రి సుమారు నాలుగు గంటల పాటు చర్చలు చరిపామని చర్చలలు సానుకూలంగా కొనసాగాయన్నారు. ప్రైవేట్ కళాశాలల సమస్యలను సమగ్రంగా అవగాహన చేసుకున్నామని చెప్పారు.






