- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేశ్ నిమజ్జనం... సెలవు ప్రకటించిన ప్రభుత్వం
by Muthe.Rajitha |
గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఊరేగింపు కారణంగా సెప్టెంబర్ 6 (శనివారం) నాడు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఊరేగింపు కారణంగా సెప్టెంబర్ 6 (శనివారం) నాడు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ కె. రామకృష్ణ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఈ సెలవుకు బదులుగా అక్టోబర్ 11 (రెండో శనివారం) నాడు పూర్తి పని దినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గణేష్ నిమజ్జనం కారణంగా జంటనగరాలతో పాటు, పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉన్నందున, ప్రజల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
Next Story






