- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD మెట్రోను స్వాధీనం చేసుకోవాలని సర్కార్ నిర్ణయం
తెలంగాణ మంత్రి మండలి సమావేశం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ఎల్&టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి మండలి సమావేశం(Telangana Cabinet) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)ను ఎల్&టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్ మెట్రో రెండో దశ (Phase II-B) విస్తరణకు సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును మొత్తం 86.1 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ విస్తరణ కోసం సుమారు రూ. 19,579 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) ఇప్పటికే ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇటీవలే మెట్రో రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా మెట్రోను స్వాధీనం చేసుకోవడం ఆసక్తిగా మారింది. దీనిపై ఎల్ అండ్ టీ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో అని చర్చనీయాంశమైంది.






