- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kaleswaram Project : కాళేశ్వరంపై కమిషన్‌కు ప్రభుత్వ కేబినెట్ మినిట్స్
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) సంబంధిత అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(PC Ghosh Commission) నేతృత్వంలోని కమిషన్‌కు నేడు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ మినిట్స్(Government Cabinet Minutes) సమర్పించింది.

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) సంబంధిత అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(PC Ghosh Commission) నేతృత్వంలోని కమిషన్‌కు నేడు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ మినిట్స్(Government Cabinet Minutes) సమర్పించింది. ఈ నివేదికలో ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్, కేవలం పరిపాలన అనుమతి (అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్) ఆధారంగానే జరిగిందని, దీనిపై 2016-2017 కాలంలో కేబినెట్‌లో ఎలాంటి సవివరమైన చర్చ జరగలేదని నివేదిక స్పష్టం చేసింది.
2016 మార్చి 1న మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇవ్వగా, పనులు ప్రారంభమయ్యే సమయానికి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) కూడా సిద్ధం కాలేదని తెలిపింది. అనుమతి ఇచ్చిన ఏడాది తర్వాత, 2017లోనే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై తొలిసారి చర్చ జరిగినట్లు నివేదిక పేర్కొంది. ప్రాజెక్టు రీడిజైన్‌లో భాగంగా, గతంలో ప్రాణహిత-చేవెళ్ల పథకం కింద తమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీని మేడిగడ్డకు మార్చడం, మూడు బ్యారేజీలు (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల), 19 పంప్ హౌస్‌లు, 20 రిజర్వాయర్లతో నిర్మాణం కొనసాగిందని తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాగ్(CAG) ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. నిర్మాణ లోపాల వల్ల మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు 2023 అక్టోబర్ 22న కుంగిపోయాయని, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా నీటి నిల్వకు పనికిరావని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) తేల్చినట్లు నివేదికలో ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్, నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, పలువురు బీఆర్ఎస్ నేతల నుండి అఫిడవిట్లు సేకరించి, డిజైన్, నాణ్యత, ఆర్థిక అంశాలపై విచారణ జరుపుతోంది.






