ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు ప్రభుత్వం అనుమతి

by Muthe.Rajitha |

ఆదిలాబాద్‌లో ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్‌లో ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఎయిర్‌పోర్టు కోసం ఆదిలాబాద్‌లో 700 ఎకరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్‌లలో బ్రౌన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలను రానున్న రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.

భూసేకరణకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి కాగానే పనులు ప్రారంభించడానికి ఏఏఐ సిద్ధమవుతోంది. ఇప్పటికే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కావాల్సిన భూసేకరణ పూర్తి కావొచ్చింది. ఇక్కడ అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఆదిలాబాద్‌లోనూ బ్రౌన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి భారత వాయుసేన అంగీకారం తెలుపడంతో ఏఏఐ రాబోయే రెండేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోంది, ఈ రెండు విమానాశ్రయాలను 2027 జూన్‌ నాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Next Story