Breaking: పోలీస్‌ శాఖలో కీలక మార్పు.. తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి.. ప్రభుత్వం ఉత్తర్వులు

by Ramesh Naini |   (  Updated:2025-09-26 14:42:39  IST  )

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీస్‌ శాఖలో కీలక మార్పులు చేపట్టింది.

Breaking: పోలీస్‌ శాఖలో కీలక మార్పు.. తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి.. ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీస్‌ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీ‌గా శివధర్ రెడ్డి (Telangana DGP Shivdhar Reddy) నీ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్ ips అధికారి గా ఉన్న శివధర్ రెడ్డి.. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 1 న తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత డీజీపీ జితేందర్‌ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

Next Story