- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సృష్టి ఘటనతో సర్కార్ అప్రమత్తం.. 29 అంశాలతో కూడిన చెక్‌లిస్ట్ రెడీ
‘సృష్టి’ ఫర్టిలిటీ (Srishti Fertility) ఘటన రాష్ట్రంలో సంచలన సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘సృష్టి’ ఫర్టిలిటీ (Srishti Fertility) ఘటన రాష్ట్రంలో సంచలన సృష్టిస్తోంది. సరోగసీ పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ (Human trafficking)కు పాల్పడిన ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నమ్రత (Doctor Namrata) పోలీసులు అరెస్ట్ చేసిన కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ‘సృష్టి’ ఘటపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫర్టిలిటీ సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆధ్వర్యంలో 35 ప్రత్యేక సెర్చ్ టీమ్‌లను దింపింది. తెలంగాణలో మొత్తం 381 ఐపీఎఫ్ సెంటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 157 ఐవీఫ్ సెంటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. తనిఖీల్లో భాగంగా స్పెషల్ సెర్చ్ టీమ్స్ ముందు జీహెచ్ఎంసీలో మూడు రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాల వారీగా సెర్చ్ టీమ్స్ సోదాలు చేయనున్నాయి. మూడు రోజుల్లో ఐవీఎఫ్ సెంటర్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీతా సత్యనారాయణ (Sangeetha Satyanarayana), అధికారులను ఆదేశించారు. ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీల కోసం మొత్తం 29 అంశాలతో కూడిన చెక్‌లిస్టును రూపొందించి స్పెషల్ సెర్చ్ టీమ్‌లకు అసైన్ చేశారు.






