- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో పరిపాలన.. పార్టీ కార్యకర్తల పనితీరు భేష్: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
తెలంగాణలో పరిపాలన బావుంది.. పార్టీ కార్యకర్తల పనితీరు బావుందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పరిపాలన బావుంది.. పార్టీ కార్యకర్తల పనితీరు బావుందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్టీ మీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గాంధీ భవన్‌లో శుక్రవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే విచ్చేయగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం అని పేర్కొన్నారు. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందన్ననారు. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే.. సమర్ధులకు పదవులు ఇవ్వాల్సిందిగా టీపీసీసీ చీఫ్ కి సూచిస్తున్నా అని తెలిపారు. పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లొద్దు అని, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి, ఒకే తాటిపై నిలువాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదికవ్వాలి.. సీఎం రేవంత్
కొత్త నాయకత్వానికి 2029 అసెంబ్లీ ఎన్నికలు వేదిక కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి..గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలి” అని సీఎం సూచించారు. మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని, కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది అన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని నేతలకు సీఎం సూచించారు. పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు. నేను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం ఇప్పించడం జరిగిందని గుర్తు చేశారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి కాంగ్రెస్ప్రభుత్వంలో పదవులు వరించాయని స్పష్టం చేశారు. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దు అన్నారు. రాజకీయాల్లో ఎదుగుదలకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయన్నారు. అలాగే, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని సీఎం తెలిపారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో మనం సక్సెస్సాధించామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామని, రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
పోలీసుల తీరుపై ఎంపీ, ఎమ్మెల్యే అసహనం..
గాంధీభవన్ వద్ద పోలీసుల తీరుపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అసహనం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ, సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జు ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలు గాంధీ భవన్‌లో ఉండటంతో వారిని కలిసేందుకు పార్టీ కేడర్ క్యూ కట్టింది. దీంతో కేడర్ లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అడ్డుకున్న వారిలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు స్టాఫ్, తదితరులు ఉన్నారు. దీంతో రేణుకా చౌదరి స్వయంగా పోలీసుల వద్దకు వచ్చి స్టాఫ్‌ను లోపలికి తీసుకెళ్లారు. ఒక దశలో పోలీసుల తీరుపై రాజ్యసభ సభ్యురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకంటే పోలీసుల హడావుడి ఎక్కువైందని రేణుకా చౌదరి మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు సైతం అసహనం వ్యక్తం చేశారు. తమను ఆపుతారా.. అంటూ పోలీసులపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.






