- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Goshamahal Osmania: గోషామహల్ ఉస్మానియా నూతన భవనాల నిర్మాణ పనులు షురూ
హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణానికి పునాది రాయి పడింది.

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణానికి పునాది రాయి పడింది. దసరా పర్వదినం సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి ఎంఈఐఎల్ డైరెక్టర్ కె.గోవర్ధన్‌రెడ్డి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశిత సమయానికి భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా నూతన భవనాల నిర్మాణం ఉంటుందన్నారు. అధునాతన సౌకర్యాలు, పరికరాలతో ఆస్పత్రి నిర్మాణం జరగబోతోందన్నారు.
12 అంతస్తులు.. 2 వేల పడకలు..
26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ పనులకు ఈ ఏడాది జనవరి 31న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 12 అంతస్తులతో 2 వేల పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించబోతోంది. బేస్‌మెంట్‍లోని రెండు అంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించబోతున్నారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తయ్యే లక్ష్యంతో పనులను ప్రారంభించారు. నూతన ఆస్పత్రి భవనాల్లో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేయబోతున్నారు. రోబోటిక్ సర్జరీ, ట్రాన్స్ ప్లాంట్ థియేటర్స్, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ ప్లాంట్‍లను నిర్మించబోతున్నారు. నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ విభాగాలకు ప్రత్యేకంగా కళాశాలలు సిద్ధం చేస్తున్నారు.






