గోషామహల్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసుల అదుపులో BRS ఎమ్మెల్యే అభ్యర్థి

by Malleboina Mahesh |   (  Updated:2023-11-29 14:20:50  IST  )

ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గోషామహల్‌ నియోజకవర్గంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది.

గోషామహల్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసుల అదుపులో BRS ఎమ్మెల్యే అభ్యర్థి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గోషామహల్‌ నియోజకవర్గంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ ఆఫీసులో నగదు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసుల సోదాలు జరిపారు. పదుల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఓటర్లు ప్రలోభ పెట్టడానికి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అక్కడకి చేరుకున్నారు. అందరిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. కానీ నందకిశోర్ వ్యాస్ వినకుండా అలాగే ముందుకు సాగడంతో పోలీసులు ఆక్ష్నను హెచ్చరించారు. అయినా వినకపోవడంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంగించారని నందకిషోర్ వ్యాస్ పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో గోషామహాల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Next Story