గుడ్‌న్యూస్.. ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.125 కోట్లు విడుదల

by Ramesh Naini |

ఓల్డ్‌ సిటీ మెట్రో రైల్వే కనెక్టివిటీ పనులకు తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక అడుగు వేసింది.

గుడ్‌న్యూస్.. ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.125 కోట్లు విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని పాతబస్తీ వాసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఓల్డ్‌ సిటీ మెట్రో రైల్వే కనెక్టివిటీ పనులకు తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక అడుగు వేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌లో భాగంగా ‘మెట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ’ పథకం కింద రూ.125 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ ఏరియా అండ్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌ (బడ్జెట్‌) శాఖ సోమవారం జీఓ జారీ చేసింది.

ఆదేశాల ప్రకారం.. మంజూరైన ఈ నిధులను సంబంధిత బడ్జెట్‌ ప్రొవిజన్‌ నుంచి రిలీజ్ కానుంది. విడుదలైన మొత్తాన్ని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్‌ ఖాతాకు మళ్లించేందుకు ట్రెజరీ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఓల్డ్‌ సిటీలో మెట్రో విస్తరణకు ఇప్పటికే పలు సార్లు ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో తాజా నిధుల విడుదలతో ప్రాజెక్టు పురోగతికి దోహదం కానుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Next Story