- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రేషన్ కార్డు దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 2 లక్షలకు పైగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఇప్పటికే అర్హత పొందిన దరఖాస్తుదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. కొత్త రేషన్ కార్డుల జారీలో అవలంబించాల్సిన విధానం, అర్హతల గురించి సబ్ కమిటీ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం ఆమోదించింది. ఆ మేరకు కొత్త కార్డులు, ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జత చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులతో పాటు మీ సేవా కేంద్రాలలో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వడపోత చేపట్టిన అధికారులు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశారు. దీంతో ఈ నెలలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నది ప్రభుత్వం.
త్వరలో స్మార్ట్ కార్డు నమూనా!:
ఈసారి లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను (Smart Ration Cards) ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని గతంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సమావేశంలోనే స్వయంగా వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు సరికొత్తగా బార్ కోడ్‌తో.. ఈజీ యాక్సెస్ చేసేలా రూపొందిస్తామని సీఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త కార్డు స్వరూపంపై తుది నిర్ణయానికి రాగా త్వరలోనే స్మార్ట్ కార్డు నమూనాను ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏటీఎం కార్డు సైజులో ఒక వైపు సీఎం, మరొక వైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటో.. మధ్యలో ప్రభుత్వం లోగో ఉండేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.






