- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. యాసంగి పంట సర్వేకు సర్కార్ కసరత్తు
కేంద్రం విధించిన గడువులోగా రాష్ట్రంలో యాసంగి పంట సర్వేను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ ప్లాన్చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం విధించిన గడువులోగా రాష్ట్రంలో యాసంగి పంట సర్వేను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ ప్లాన్చేస్తున్నది. 45 రోజుల్లో పూర్తి చేసేందుకు గాను ప్రైవేట్ సర్వేయర్లు, వలంటీర్ల నియామకాలను చేపడుతున్నది. ఇందుకు గ్రామాల్లో ఉన్న యువతను గుర్తించి జిల్లా అధికారులు వివరాలు అందజేయనున్నారు. ప్రస్తుతమున్న ఏఈవోలతో పూర్తి కావాలంటే 90 రోజుల సమయం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,621 గ్రామాల్లో 194. 69 లక్షల సర్వే నెంబర్ల ఉండగా ఇందులో 9795 గ్రామాలకు విలేజ్మ్యాప్ఉంది. వీటిలోని 174.36 లక్షల సర్వే నెంబర్లకు సంబంధించిన పంట భూముల సర్వేను ప్రైవేటు సర్వేయర్లు, వలంటీర్లకు అప్పగిస్తారు. మిగిలిన 826 గ్రామాల్లోని పోడు భూముల పంట సర్వేను వ్యవసాయ విస్తరణాధికారులు చేస్తారు. కొత్తగా తీసుకున్న వలంటీర్లు, ప్రైవేటు సర్వేయర్లు అదే గ్రామానికి చెందిన వారు కావడంతో రోజుకు 150 నుంచి 200 సర్వే నెంబర్ల కలిగిన పంట ఫొటోలు తీసే అవకాశం ఉంటుంది. ఈ సర్వేతో వారు రోజు రూ.1000 నుంచి రూ.1500 వరకు సంపాదించుకోవచ్చు. వారంతా 10 రోజులు పనిచేస్తే గ్రామంలో ఉన్న పంటల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వవచ్చు. పంట సర్వే కోసం కేంద్రం రూ.30.42 కోట్లు కేటాయించగా వానాకాలం సీజన్‌లో సర్వే చేస్తే రూ.2.93 కోట్లు ఖర్చయింది. మిగిలిన నగదుతో ప్రైవేటు సర్వేయర్లు, వలంటీర్లకు ఫొటోకు రూ.7 చొప్పన ఇవ్వనుంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్చావ్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం జరిపి తాము సూచించిన గడువులో డిజిటల్సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. దీనిపై ఉన్నతాధికారుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో వెంటనే కొందరు ఏఈవోలతో సాధ్యసాధ్యాలపై వివరాలు తెలుసుకున్నారు. వారు తమతో పాటు ప్రైవేటు సర్వేయర్లు, స్థానికంగా ఉండే వలంటీర్ల సహాయం తీసుకుంటే వంద శాతం ఖచ్చితమైన సర్వే రిపోర్టు ఇచ్చి పంట సాగు చేసిన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయవచ్చని సూచనలు చేశారు. వారి సలహాలు పరిగణలోకి తీసుకున్న వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రెండు రోజుల కితం ప్రైవేటు వ్యక్తులను తీసుకోవాలని ఆదేశించారు. పనిచేసే సామర్థ్యం కలిగిన యువతను ఎంపిక చేసుకోవాలని ఏఈవోలకు సూచించారు.
స్థానిక యువతకు ప్రాధాన్యం
సర్వేను వేగంగా చేసేందుకు స్థానికంగా ఉండే యువతను వలంటీర్లుగా రిక్రూట్చేసుకొని వారికి నాలుగైదు రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్చేస్తున్నది. ఒక గ్రామానికి ఒక వలంటీర్ మాత్రమే ఉండాలి. బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లమా, ఏదైనా సైన్సు కోర్సు, ఇంటర్, పదవ తరగతిలలో ఏదో ఒకటి ఉత్తీర్ణులుగా ఉండాలి. మొబైల్యాప్వినియోగించే విధానం తెలియాలి. సెలవులు లేకుండా సర్వే పూర్తయ్యే వరకు పనిచేయాలి.
తమకే సర్వే బాధ్యత ఇవ్వాలంటున్న ఆదర్శ రైతులు
గతంలో సర్వేలు చేసిన అనుభవం ఉన్న తమకే పంట సర్వే బాధ్యతను అప్పగించాలని రాష్ట్రంలోని ఆదర్శ రైతులు కోరుతున్నారు. తామంతా స్వయంగా రైతులు కావడంతో సరిహద్దు రాళ్లు, రైతుల వివరాలు త్వరగా గుర్తిస్తామని చెబుతున్నారు. వీరు మున్సిపల్ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి పంట సర్వే పనులు అప్పగించాలని కోరనున్నట్లు సమాచారం.






