174 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్ లిస్ట్ రిలీజ్

by Prasad Jukanti |   (  Updated:2026-03-29 11:55:20  IST  )

ఏప్రిల్ 9న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం వెల్లడించింది.

174 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్ లిస్ట్ రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించిన మెరిట్‌ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం విడుదల‌ చేసింది. గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో మొత్తం 174 పోస్టుల భర్తీకి ఈ జాబితా వెల్లడించినట్లు బోర్డు పేర్కొంది. గైనకాలజీలో 90 పోస్టులు, అనస్తీషియాలో 44, పీడియాట్రిక్స్‌లో 28, ఆర్థోపెడిక్స్‌లో 12 పోస్టులు ఉన్నాయి. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్‌ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 9న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల సెలక్షన్ లిస్ట్:

అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీపై మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక అప్ డేట్ ఇచ్చింది. 2312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్‌ను ఏప్రిల్ 9వ తేదీ నాటికి విడుదల చేయనున్నట్టు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు ఇటీవలే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్‌ విడుదలపై దృష్టి సారించారు.

Next Story