- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్కార్ కీలక నిర్ణయం.. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన యూనివర్సిటీల్లో మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ మెడికల్ అండ్ హెల్ట్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఉస్మానియా యూనివర్శిటీ (OU) పరిధిలో, శాతవాహన యూనివర్శిటీ (SU), కాకతీయ యూనివర్శిటీ (KU), పాలమూరు యూనివర్శిటీ (PU)ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆసక్తి గల అభ్యర్థుల నుంచి http://mhsrb.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారలో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులను జూలై 10 నుంచి స్వీకరించబోతున్నామని వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 17, సాయంత్రం 5 గంటల వరకు అని పేర్కొన్నారు. అదేవిధంగా అభ్యర్థులు వారి దరఖాస్తులను 18 జూలై నుంచి 19 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సపరేట్ ఒక్కో ఒక్కో పోస్టుకు అప్లై చేయాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. మల్టీ జోన్-1లో మొత్తం 379 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్ -2లో మొత్తం 228 పోస్టులు ఉన్నాయి. పోస్టకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ నిబంధనల ప్రకారం రూ.68,900 నుంచి రూ.2,05,500 ఉందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
ఇక మరో 8 యూనివర్సిటీల్లో కూడా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఆయా యూనివర్సిటీల్లో 15 ఏళ్లకుపైగా పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రం ఎప్పటిలాగే కొనసాగనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను మాత్రమే భర్తీ చేయనున్నారు. ఆయా వర్సిటీలు రిజర్వేషన్లను పాటించేందుకు రోస్టర్ పాయింట్లు రూపొందించి.. పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
Read More : తెలంగాణలో మరో కొలువుల జాతర..నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..16,448 పోస్టులతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్






