- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12వేల పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!?
తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. జాబ్ క్యాలెండర్(Job Calendar) ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల(Police Jobs) కోసం ఇప్పటికీ కోచింగ్ తీసుకుంటున్నారు.
ఈ తరుణంలో పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రం(Telangana)లో మరోసారి ఉద్యోగాల జాతర జరగనుంది. భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖ(TG Police Department)లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. పోలీస్ శాఖలో మరోసారి నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉండవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఎందుకంటే.. ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్ లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరుగడంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం (Government) ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.






