Good News: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్.. మార్చి 8న 14 వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్

by Prasad Jukanti |

మార్చి 8న 4 కొత్త పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు.

Good News: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్.. మార్చి 8న 14 వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (international women's day) సందర్భంగా తెలంగాణ మహిళలకు, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8న నాలుగు కొత్త పథకాలను (New Schemes) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై మంత్రి సీతక్క (Seethakka) ఇవాళ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మ‌హిళలకు సంబంధించి పలు పథకాలను శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో 50 బస్సులకు సీఎం పచ్చజెండా ఊపనున్నారని వెల్లడించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల మంజూరు, 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్‌ బంకుల నిర్వహణకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన, 14 వేల అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల నియామ‌కానికి నోటిఫికేష‌న్ విడుదల చేయడంతో పాటు ఇందిరా మ‌హిళా శ‌క్తి- 2025 రిలీజ్ చేస్తారని మంత్రి తెలిపారు.

Next Story